Flow రిటన్ బై Mihaly Csizkenmihaly ఏంటి పేరు స్పెల్లింగ్ ఒకలా ఉంది అనుకుంటున్నారా? ఈయన ఈ పుస్తకం లో మనందరికీ ఎలాంటి అవుట్ సైడ్ influence లేకుండా మన లోపల నుంచి మనల్ని మనమే ఏ పని అయినా ఒక ఫ్లో లో ఒక జోన్ లో ఎలా చేయాలి? ఎంతో కష్టం అయినా పనులను కూడా సింపుల్ గ ఎలా చేయాలో ఈ పుస్తకం లో అద్భుతం గా వివరించారు, ఈ ఆర్టికల్ చివరిదాకా చదివితే లేదా పై వీడియో పూర్తిగా చుసిన అద్భుతం అని మీరు కూడా ఒప్పుకోక తప్పదు, Enjoyment vs pleasure Pleasure అంటే మనం ఎం చేయకుండా, ఎలాంటి ఎఫర్ట్ పెట్టకుండా పూర్తిగా హ్యాపీ గ, రిలాక్స్ అయిపోవడం. Ex : watching tv , sleeping etc Enjoyment అంటే మనం physical గ కొంచెం ఎఫర్ట్ పెట్టాల్సింది ఉంటుంది, మెంటల్ గా ఆలోచించాల్సింది ఉంటుంది, అండ్ ఒక దానిని సాధించడానికి ఒక ప్రయత్నం మనం ఎంజొయ్మెంత్ లో చేస్తాం. EX : Playing , Cooking etc మన పనిలో మనం ఫోకస్డ్ గ ఉండాలంటే మనకి దొరికిన కాలి సమయాన్ని ఎక్కువగా enjoyment కి వాడాలి గాని pleasures కి లోను అవ్వకూడదు. How to enjoy your work ? challenges ఉండాలి అలాగే వాటిని ఎదురుకునే స్కిల్స్ మనకి ఉండాలి, ఎప్పుడైతే చేసే పని లో మన స్కిల్స్ కి మించి challenges ఎక్కువగా ఉంటాయో మనకి ఆందోళన ఎక్కువ అవుతుంది, అలాగే ఎలాంటి challenges లేకుండా ఆ పని ఉంటె స్లో గ మనకి బోర్ మొదలు అవుతుంది, అందుకే ఈ రెండు మన పనిలో ఉండేలా మనం చూసుకుంటే మనం చేసే పనిలో మనకంటూ ఒక ఫ్లో దొరుకుతుంది. Finding flow in your work మన పని లో మనం ఫ్లో వెతుకోవాలి అంటే మనం ఒకటే చేయాలి, ఒకేసారి ఎక్కువ challenges ఉన్న వర్క్ ని తీసుకోకుండా మన స్కిల్స్ కి తగ్గ challenging గా ఉండే వర్క్ ని తీసుకుంటా నిదానంగా ఇంప్రూవ్ అవుతూ వెళ్తే మీరు ఒక ఫ్లో ని మీ పనిలో పట్టుకుంటారు. Focus on your ideas not on your flaws మన పనిలో మనకి challenges బాగా ఎక్కువ ఉంటె మీకు ఆందోళన కలగవచ్చు ఆ సమయంలో ఈ పని నావల్ల కాదులే అనే ఆలోచన కి వచ్చే ముందు ఒకసారి మళ్ళి ఆ పని లో మీకు ఇష్టమైన విషయం మీద మీరు concentrate చేయండి, దీనివల్ల మీకు ఉన్న ఐడియా ఇంప్రూవ్ అవుతుంది మీ స్కిల్ పెరుగుతుంది ఛాలెంజ్ ని అధిగమిస్తారు. అలాగే, మీ పని ఎక్కువ challenging గా లేదు అంటే ఈ పని ని నిన్నటి కంటే ఫాస్ట్ గ పూర్తి చేస్తా, అని మీతో మీరే అనుకుని ఒక ఛాలెంజ్ ని మీరే సృష్టించుకోవాలి, అప్పుడు మీకు బోర్ అనిపించదు, మీ పనిని మీరు హ్యాపీ గా పూర్తి చేస్తారు. Come back to your roots ఎపుడైనా మన పని లో మనకి ఒంటరితనం అనిపిస్తే, ఒకసారి మీ ఫ్రెండ్స్ అండ్ ఫామిలీ తో కలిసి enjoyment కి టైం ఇవ్వండి, pleasures కాదు only enjoyment , దీనితో మీరు recharge అవుతారు, అప్పుడు మళ్ళి మీ పని మొదలుపెట్టవచ్చు. How to Stay focused మీ పని లో మీరు ఎప్పుడు ఫోకస్డ్ గా ఉండాలంటే మనకంటూ మూడు స్ట్రాటెజిలు ఉండాలి. ఒకటి loose your ego and trust your ability చేసే పనిలో మనం తీసుకునే నిర్ణయాలు లో ఎప్పుడు మన ఎబిలిటీ నే ఆధారంగా చేసుకుని ముందుకు వెళ్ళాలి, ego కి మాత్రం తీసుకోకూడదు. రెండు Being mindful మన గోల్ కోసం మనం పడుతున్న కష్టం కోసం మన మైండ్ ఎప్పుడు మన పని మీద దాని ప్రతి ఒక్క డీటెయిల్ మీద concentrate చేయాలి గాని భయపడకూడదు. మూడు Search for novel solutions at your difficult times ఎంత కష్టమైనా పరిస్థితుల్లో ఉన్న మన ఆలోచనలు ఎప్పుడు ఆ పరిస్థితి కి సొల్యూషన్ వెతికే పనిలోనే ఉండాలి. Focus on your goal and take action మన జీవితానికి ఒక అర్ధం ఉండాలి అంటే మనకంటూ ఒక మంచి గోల్ ఉండాలి అండ్ ఆ గోల్ ని సాధించడానికి మనం బలమైన కోరిక తో బలమైన నిర్ణయాలతో మనం ఒక ఆక్షన్ తీసుకోవాలి. సో, మీ ఫ్లో ని పట్టుకోండి, ఒక ఫ్లో లో అన్ని పనులు చేసేయండి.
0 Comments
ఈరోజు మనం law of attraction అంటే ఏంటి తెల్సుకుందాం .
మనకి మన పెద్దవాళ్ళు చెప్తుంటారు . మనం ఏమైనా చేయాలి అంటే ముందు మన మనసులో అనుకోవాలి అదే కాకుండా మనకి ఏమైనా పని అవ్వాలి అంటే దానికి 90% planning కావాలి ఆ planing కి తగట్టు పని చేస్తేనే ఆ result అనేది వస్తుంది . ఈ law of attraction అనే concept rhonde Byrne రాసిన the secret అనే పుస్తకం ధ్వారా చాల famous అయింది . అసలు ఈ law of attraction ఏమని చెప్తుంది అంటే . మనకి ఏమైనా జరగాలి అని అనుకుంటే ముందు అది compulsory గా జరుగుతుంది అనే నమ్మకం ఉండాలి దానితో పాటు మన ఆలోచనల్ని కూడా దాని మీదే ఉంచాలి . మన నమ్మకం ఆలోచన గనక గట్టిగ ఉంటె . మనం ఏమి అనుకుంటే అది జరుగుతుంది అనేది law of attraction లోని concept. ఈరోజు ఇది నిజంగా జరుగుతుందా లేదా అనే దాని మీద discuss చేద్దాము . ముందు మనకు ఎమన్నా కావాల్సిన పని జరగాలి అనుకుంటే ఆ ఆలోచన ముందు మన brain కి వెళ్తుంది . మన brain ఆ ఆలోచన కి solution వెతుకుతుంది . మనకి solutions వచ్చినప్పుడు మనం ఆ పని మీద work మొదలుపెడతాం . మనకి ఏ పని జరగాలన్నా దానికి మన మెదడు చాల ముఖ్యం . ప్రపంచంలో ఉన్న 80లక్షల జీవరాశులలో దేవుడు మనకే ఆలోచించే మెదడు ని ఇచ్చాడు . అందుకే మనకన్నా పెద్ద జంతువులు బలమైన జంతువులు ఉన్నా మనం వాటిని ctrl చేయగలిగే capacity మన మనుషలకే ఉంది ఇది తరతరాలుగా మన DNA లో పాతుకుపోయిన ఒక వరం . దీని బట్టి మనం ఆలోచిస్తే మనుషులు అందరికి common గా ఉండేది DNA . so మన అందరికి ఆలోచించే శక్తీ ఉంది కానీ మనం మన ఆలోచనల్ని సరైన విధంగా ఉపయోగించము . ఎవరైతే ఉపయోగిస్తారో వాళ్ళు పెద్ద పెద్ద scientist లు engineers doctor లు business man లు అవుతారు . ఇప్పుడు మనం daily ఉండే problem లు ఎలా solve చేస్తామో చూద్దాము ఇపుడు మనకి చలి గా ఉంది దానిని problem అనుకుంటే మనం అప్పుడు fan ఆపేస్తాము . అదే వేడి గా ఉంటె fan వేసుకుంటాం . అదే విధంగా మనకు ఆకలి వేస్తే మనం భోజనం చేస్తాం . So ఇవన్నీ మనకి daily ఉండే చిన్న చిన్న problem. దీనిని మనకు నచ్చిన విధంగా solve చేస్తాం . మనలో ఇప్పుడు చాల మంది లావు అయిపోతున్నాము weight ఎలా తగ్గాలి అని అనుకుంటూవుంటాము ఇలా లావు గా ఉండేవాళ్ళు weight తగ్గాలి అని అనుకుంటే వాళ్లలో చాల తేడాలు వచ్చేస్తాయి . Gym కి వెళ్ళాలి . ఎలా workout చేయాలి . ఎలాంటి food తినాలి , ఎలాంటి food తినకూడదు . రకరకాల diet లు follow అవుతారు చాల మంది తగ్గుతారు కూడా . ఇక్కడ మనం చూస్తే వాళ్ళు లావు గా ఉన్నపుడు YouTube లో video లు diet లు తెగ చేసేస్తారు , ఇవన్నీ ఎప్పట్నుంచో ఉన్నాయ్ కానీ వాళ్ళకి ఆ ఆలోచన అనేది వచ్చినప్పుడు మాత్రమే అవి చూస్తారు . వాళ్ళకి ఆ ఆలోచన రాగానే ఎప్పుడు చూడని video లు weight loss పుస్తకాలు చదివి వాళ్లకి వున్న problem కి solution వెతికేవాళ్ళు బరువు తగ్గించుకుంటారు . ఈ విధంగా law of attraction పని చేస్తుంది . ఈ law of attraction పని చేయాలి అంటే రెండు ప్రశ్నలు మనల్ని మనం వేసుకోవాలి . ఒకటి నాకు ఏమి కావాలి . రెండు అది కావాలంటే నేను ఏమి చేయాలి . ఇపుడు మనకి డబ్బులు కావాలి ధనవంతులు అవ్వాలి అనుకుందాం . దాని కోసం మనం ఏమి చేయాలి . ముందు ధనవంతుడు అయినట్టు ఆలోచించి నేను ధనవంతుడుని అయ్యాను అని అనుకోవాలి . ఏంట్రా అనుకుంటే అయిపోతుందా , నేను చాల అనుకుంటా అవన్నీ అయిపోతాయా అని నన్ను అడగొద్దు . అది నిజమే ఎందుకంటే మనం అనుకోగానే అన్ని అయిపోవు . చాల మంది కొన్ని తప్పులు చేస్తారు . వాటి వల్ల మనం అనుకున్నవి చేయలేము . అవేవో పెద్ద తప్పులు కాదు కానీ అవి నీ పనిని మాత్రం ఆపేస్తాయి అవి ఏంటంటే . 1. మనం మన brain కి పని పెట్టం. ఈరోజుల్లో fb ఉంది Youtube ఉంది PlayStation ఉన్నాయి evening pub లు ఉన్నాయి . ఈ విధంగా ఆలోచిస్తే మనకి రోజు అంత entertainment లు ఉంటాయి ఇన్ని entertainment లు ఉంటె మనకి ఆలోచించడానికి ఇంత time ఎక్కడ ఉంది ముందు మనం చేయాల్సింది ఏంటి అంటే , మనం concentration అంత చేయాల్సిన పని మీద ఉంచాలి అప్పుడే మనం ఆ పని correct గా చేయగలం అంతే కానీ కాస్పెయూ fb browse చేద్దాము ఒక CInema చూసి పనిచేద్దాం అని ఆలోచిస్తే మన పనులు అవ్వవు కదా , slow గా మనం ఆ పని చేయడమే మానేస్తాం . 2 మన వల్ల కానీ పనులు గురించి ఆలోచన చేయడం . OK నిన్న అంతా సినిమాలు చూసాం ,fb, whatsapp, social media చుట్టేసాం , బయట తిరిగేసాం . తర్వాత ...ఈరోజు ఏమనుకుంటున్నాము ? అయ్యో నిన్న అంతా time waste చేసేసామే అని. అలా అనుకోవడం వల్ల ఈరోజు కూడా time waste అవుతుంది తప్ప అయిపోయిన విషయాన్ని మార్చలేం .so ఈ విధమైన ఆలోచనలు ఉంటె మనం అనుకున్న పనులు చేయడం చాల కష్టం . మన brain కి confusion ఇచ్చే పనులు గురించి ఆలోచన చేయడం , ఇది మన అందరికి common గా ఉండే తత్వం . నాకు కొంత మంది చెప్తుంటారు . నా దగ్గర చాల idea లు ఉన్నాయి . అది start చేస్తే నా company పెద్ద trendset చేస్తుంది అని . మళ్ళీ వాళ్లలోనే వేరే ఆలోచన ఉంటుంది అయినా ఇప్పుడు life happy గా ఉంది ఇన్ని risk లు అవసరమా అని . ఇలా మనలో రెండు రకాల ఆలోచనలు ఉండడం వల్ల ఉపయోగం లేదు . నువ్వు చేయాలి అనుకుంటే నువ్వు ఆ పని చేయాలి వద్దు అనుకుంటే వదిలేయాలి అంతే కానీ రెండు పడవల మీద కాళ్ళు వేయడం వల్ల ఉపయోగం లేదు . 3 మనం అనుకున్న పని చేయటానికి కావాల్సినంత time ఇవ్వకపోవడం . ఇప్పుడు మనలో చాల మంది నాకు ఒక business idea ఉంది దాని ధ్వారా కొన్ని కోట్ల రూపాయిలు సంపాదిస్తా అని అంటారు సరే business మొదలు పెడదాం అనుకునే సరికి ఎందుకొచ్చింది . మనం అనుకున్న time కి సంపాదిస్తామో లేదో అని ఆలోచించి ఆ పని చేయడం మానేస్తారు . మనం ఏమైనా పని చేయాలి అంటే దానికి కొంచెం సమయం పడతుంది అంతే కానీ అన్ని పనులు అయిపోవాలి అంటే అవ్వవు . కొన్ని సార్లు మనం అనుకున్నది సాధించడానికి కొన్ని సంవత్సరాలు పడతుంది లేకపోతే ఒక పది సంవత్సరాలు పట్టొచ్చు కానీ మన అనుకున్న పని మాత్రం అవుతుంది . So మనం ఏ పని చేయాలి అనుకున్న దానికంటూ సమయం పడుతుంధి అనే అవగాహనా మనకు ఉండాలి . అంతా బానే ఉంది , మన law of attraction బాగా పని చేయాలి అంటే ఏమి చేయాలి ? 1ముందు మనం problem నుంచి పరిగెత్తకుండా . ఆ problem ని solve చేయగలము అనే ధ్యాస పెట్టాలి 2 మనం పని చేసేప్పుడు మన focus అంతా ఒక problem మీద ఉండాలి అది అయ్యేంతవరకు మన concentration దాని మీదే ఉండాలి 3 negative ఆలోచన ఆపేసి మనం ఆ పని చేయగలం అనే ధీమా తో ముందుకు వెళ్ళాలి . 4 ఇది చాల important. ముందు నువ్వు చేసే పని నీవల్ల నిజంగా అవుద్దా లేదా అనే నిర్ధారణ నీలో ఉండాలి . లేకపోతే అనవసరంగా అవ్వని పనులు మీద నీ energy ని waste చేసినట్టు ఉంటుంది . ఈ విధంగా ఈ నాలుగు rules apply చేయగల్గితే . మనం అనుకున్నది అనుకున్నట్టు చేయగలం . The Seven habits of highly effective peopleHOW TO STOP WORRYING AND START LIVINGPART 2 |