Telugu Geeks
  • home
  • involve
  • library
  • blog
  • Contact

చదివింది 100% గుర్తుండాలంటే ఇలా చేయండి | REMEMBER 100% WHAT YOU STUDY|

6/24/2019

1 Comment

 

10 memory techniques discussed in the video 

​Registration retention recall.
మన మెమరీ లో ఏదైనా బలంగా గుర్తుండాలంటే రెజిస్టరయినా ఇన్ఫర్మేషన్ ని ఎక్కువగా గుర్తు చేసుకుంటూ ఉండాలి, అప్పుడే మనం ఆ ఇన్ఫర్మేషన్ recall చేసుకోగలం,

Forgetting Curve
ఏమైనా చదివిన తరువాత మనం కొన్ని రోజులకి మరిచిపోతాం సో మరిచిపోకుండా ఉండడానికి మనం చదివిన దాన్ని వన్ హౌర్ తరువాత మళ్ళి చదవాలి తరువాత ఒక రోజు తరువాత మళ్ళి చదవాలి తరువాత ఒక వారం తరువాత ఒక నెల తరువాత ఈ దెబ్బ తో మీ మెమరీ లో ఆ ఆన్సర్ ఉండిపోతుంది.

Activation
ఒక సబ్జెక్టు చదవక ముందే మనకి ఆ సబ్జెక్టు గురుంచి మనకి ఎం తెలుసు అనేది ఒక పేపర్ మీద రాసుకోవాలి తరువాత చదవడం మొదలు పెడితే చదివింది మీకు చాల బాగా అర్ధం అవుతుంది.

Mind Maps
ఒక పేపర్ తీసుకుని మీరు మెమొరీజ్ చేదాం అనుకున్న దాన్ని సెంట్రల్ ఐడియా రాసి దాన్ని పూర్తి చేసే కాన్సెప్ట్స్ ని బ్రాంచెస్ గా రాసుకోండి, అది ఎప్పుడు చుసిన కూడా మీకు మొత్తం గుర్తుకువచ్చేస్తుంది.

Story Building

మీరు ఏదైతే మెమొరీజ్ చేదాం అనుకుంటున్నారో దాన్ని ఒక కథ రూపం లో లేదా పాత రూపంలో లేదా ఒక poem రూపం లో రాసుకోవడం, అప్పుడు మీకు ఆ ఆన్సర్ చాల బలంగా గుర్తుంటుంది.

Mnemonics
మథెమతిచల్ ఫార్ములాస్, కెమిస్ట్రీ పీరియాడిక్ టేబుల్స్ ఇలాంటివి గుర్తుండకపోతే మునిమోనిక్స్ రూపం లో గుర్తుంచుకోవచ్చు ఆల్రెడీ గూగుల్ లో చాల న్మేమోనిక్స్ ఉన్నాయి ఒక సారి చెక్ చేయండి.

Flash cards

ఒక కార్డు కి ఒక వైపు question రాసి, ఇంకొకవైపు దాని ఆన్సర్ రాసి అప్పుడప్పుడు ఆ ఫ్లాష్ కార్డు ని అటు ఇటు తిప్పుతా చుడండి మీకు ఆ ఆన్సర్ బాగా గుర్తుంటుంది సో ఇలాంటి ఫ్లాష్ కార్డ్స్ మీ ఓన్ గా తయారుచేసుకోవచ్చు కూడా

Pop Quiz

మీరు ఏదైతే మెమొరీజ్ చేసుకుందాం అనుకుంటున్నారా దాని ఒక క్విజ్ రూపం లో అప్పుడప్పుడు ఎప్పుడు గుర్తు వస్తే అప్పుడు మీ ఫామిలీ వాళ్ళని ఫ్రెండ్స్ ని గాని అడుగుతుందామని చెప్పండి దీనితో మీకు ఆ ఆన్సర్స్ బాగా మెమొరీజ్ అయిపోతాయి.

Draw Pictures
మనం ఎక్కువ విసువల్ గా గుర్తుంచుకుంటాం, సో మీకు కష్టంగా ఉన్న కాన్సెప్ట్ దియాగ్రమ్ రూపంలో ఎలా గుర్తుంచుకోవాలో ఆలోచించండి. మీకు గుర్తుంటుంది.

Make a Study Sheet

మనం ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే సమయం లోనే ఒక స్టడీ షీట్ తాయారు చేసుకుని దాన్ని ఎక్సమ్ కి వెళ్లే ముందు ఒకసారి చూసుకుని వెళ్పోన్ది దీనితో మీకు ఆన్సర్స్ ఇంకా బాగా గుర్తుంటాయి.

సో ఫ్రెండ్స్ ఇది మేటర్ ఈ వీడియో ప్రతి స్టూడెంట్ కి అంటే నేర్చుకోవాలి అనే ఆలోచన ఉన్న ప్రతి ఒకడికి బాగా ఉపయోగపడతాయి అని నేను అనుకుంటున్నాను మరి మీరు ఎం అనుకుంటున్నారు? మీకు నచ్చిన కాన్సెప్ట్ ని మాతో కామెంట్స్ లో షేర్ చేసుకోండి అలాగే మీకు తెలిసిన కాన్సెప్ట్స్ ఉంటె వాటిని కూడా షేర్ చేసుకోండి
1 Comment

ATTITUDE అంటే ఇలా ఉండాలి ! | LION ATTITUDE | MOTIVATIONAL VIDEO IN TELUGU

11/2/2018

0 Comments

 
0 Comments

ఈ ఒక్క పదం లో ఉన్న శక్తి | Positive Affirmation and thinking that can change your life

9/30/2018

1 Comment

 
​Positive Affirmations are the most powerful positive thinking technique that is used by many people around the world. Whenever our subconscious mind is over taken by negative thoughts we should train our subconscious with some positive affirmations to get the things done. In this video we have discussed about positive affirmations and how to use them for our own success.
1 Comment

Success AFFIRMATIONS for the Students preparing for Exams | Boost your subconscious mind

9/20/2018

3 Comments

 
Download mp3
Picture
3 Comments

INCREASE FOCUS AND CONCENTRATION TO STUDY | THE MOST FOCUSED TECHNIQUE FOR SUCCESS

9/8/2018

0 Comments

 

Flow రిటన్ బై Mihaly Csizkenmihaly
ఏంటి పేరు స్పెల్లింగ్ ఒకలా ఉంది అనుకుంటున్నారా?  ఈయన ఈ పుస్తకం లో మనందరికీ ఎలాంటి అవుట్ సైడ్ influence లేకుండా మన లోపల నుంచి మనల్ని మనమే ఏ పని అయినా ఒక ఫ్లో లో ఒక జోన్ లో ఎలా చేయాలి? ఎంతో కష్టం అయినా పనులను కూడా సింపుల్ గ ఎలా చేయాలో ఈ పుస్తకం లో అద్భుతం గా వివరించారు, ఈ ఆర్టికల్ చివరిదాకా చదివితే లేదా పై వీడియో పూర్తిగా చుసిన అద్భుతం అని మీరు కూడా ఒప్పుకోక తప్పదు,

Enjoyment vs pleasure
Pleasure అంటే మనం ఎం చేయకుండా, ఎలాంటి ఎఫర్ట్ పెట్టకుండా పూర్తిగా హ్యాపీ గ,  రిలాక్స్ అయిపోవడం. Ex : watching tv , sleeping etc
Enjoyment  అంటే మనం physical గ కొంచెం ఎఫర్ట్ పెట్టాల్సింది ఉంటుంది, మెంటల్ గా ఆలోచించాల్సింది ఉంటుంది, అండ్ ఒక దానిని సాధించడానికి ఒక ప్రయత్నం మనం ఎంజొయ్మెంత్ లో చేస్తాం. EX : Playing , Cooking etc
మన పనిలో మనం ఫోకస్డ్ గ ఉండాలంటే మనకి దొరికిన కాలి సమయాన్ని ఎక్కువగా enjoyment కి వాడాలి గాని pleasures కి లోను అవ్వకూడదు.

How to enjoy your work ? challenges ఉండాలి అలాగే వాటిని ఎదురుకునే స్కిల్స్ మనకి ఉండాలి, ఎప్పుడైతే చేసే పని లో మన స్కిల్స్ కి మించి challenges ఎక్కువగా ఉంటాయో మనకి ఆందోళన ఎక్కువ అవుతుంది, అలాగే ఎలాంటి challenges లేకుండా ఆ పని ఉంటె స్లో గ మనకి బోర్ మొదలు అవుతుంది, అందుకే ఈ రెండు మన పనిలో ఉండేలా మనం చూసుకుంటే మనం చేసే పనిలో మనకంటూ ఒక ఫ్లో దొరుకుతుంది.

Finding  flow  in  your  work
మన పని లో మనం ఫ్లో వెతుకోవాలి అంటే మనం ఒకటే చేయాలి, ఒకేసారి ఎక్కువ challenges ఉన్న వర్క్ ని తీసుకోకుండా మన స్కిల్స్ కి తగ్గ challenging గా ఉండే వర్క్ ని తీసుకుంటా నిదానంగా ఇంప్రూవ్ అవుతూ వెళ్తే మీరు ఒక ఫ్లో ని మీ పనిలో పట్టుకుంటారు.

Focus  on  your  ideas  not  on  your  flaws
మన పనిలో మనకి challenges బాగా ఎక్కువ ఉంటె మీకు ఆందోళన కలగవచ్చు ఆ సమయంలో ఈ పని నావల్ల కాదులే అనే ఆలోచన కి వచ్చే ముందు ఒకసారి మళ్ళి ఆ పని లో మీకు ఇష్టమైన విషయం మీద మీరు concentrate చేయండి, దీనివల్ల మీకు ఉన్న ఐడియా ఇంప్రూవ్ అవుతుంది మీ స్కిల్ పెరుగుతుంది ఛాలెంజ్ ని అధిగమిస్తారు.
అలాగే, మీ పని ఎక్కువ challenging గా లేదు అంటే ఈ పని ని నిన్నటి కంటే ఫాస్ట్ గ పూర్తి చేస్తా, అని మీతో మీరే అనుకుని ఒక ఛాలెంజ్ ని మీరే సృష్టించుకోవాలి, అప్పుడు మీకు బోర్ అనిపించదు, మీ పనిని మీరు హ్యాపీ గా పూర్తి చేస్తారు.

Come back  to your roots
ఎపుడైనా మన పని లో మనకి ఒంటరితనం అనిపిస్తే, ఒకసారి మీ ఫ్రెండ్స్ అండ్ ఫామిలీ తో కలిసి enjoyment కి టైం ఇవ్వండి, pleasures కాదు only enjoyment , దీనితో మీరు recharge అవుతారు, అప్పుడు మళ్ళి మీ పని మొదలుపెట్టవచ్చు.

How to Stay focused

మీ పని లో మీరు ఎప్పుడు ఫోకస్డ్ గా ఉండాలంటే మనకంటూ మూడు స్ట్రాటెజిలు ఉండాలి.
ఒకటి    loose  your  ego and  trust  your  ability
చేసే పనిలో మనం తీసుకునే నిర్ణయాలు లో ఎప్పుడు మన ఎబిలిటీ నే ఆధారంగా చేసుకుని ముందుకు వెళ్ళాలి, ego కి మాత్రం తీసుకోకూడదు.

రెండు  Being  mindful
మన గోల్ కోసం మనం పడుతున్న కష్టం కోసం మన మైండ్ ఎప్పుడు మన పని మీద దాని ప్రతి ఒక్క డీటెయిల్ మీద concentrate చేయాలి గాని భయపడకూడదు.
మూడు Search  for  novel  solutions at  your  difficult  times
ఎంత కష్టమైనా పరిస్థితుల్లో ఉన్న మన ఆలోచనలు ఎప్పుడు ఆ పరిస్థితి కి సొల్యూషన్ వెతికే పనిలోనే ఉండాలి.

Focus  on  your  goal  and  take  action

మన జీవితానికి ఒక అర్ధం ఉండాలి అంటే మనకంటూ ఒక మంచి గోల్ ఉండాలి అండ్ ఆ గోల్ ని సాధించడానికి మనం బలమైన కోరిక తో బలమైన నిర్ణయాలతో మనం ఒక ఆక్షన్ తీసుకోవాలి.

సో, మీ ఫ్లో ని పట్టుకోండి, ఒక ఫ్లో లో అన్ని పనులు చేసేయండి.


0 Comments

మీ విజయానికి 5 మెట్లు | 5 Steps To Change Your Life

9/7/2018

0 Comments

 
0 Comments

ఒక మందబుద్ధి జీనియస్ సైంటిస్ట్ గా ఎదిగిన కధ |BIOGRAPHY OF ALBERT EINSTEIN IN TELUGU

9/2/2018

1 Comment

 
ALWAYS BE CURIOUS

ఐంస్టీన్ చనిపోయిన తరువాత ఆయన్ని autopsy చేసిన పాథోలోజిస్ట్స్ ఆల్బర్ట్ ఐంస్టీన్ బ్రెయిన్ ని ఫామిలీ members కి చెప్పకుండా  preserve చేశారు, ఎందుకు ఆయన అంత తెలివైన వాడు? అనేదాని మీద రీసెర్చ్ కి వాడుకున్నారు, ఆ బ్రెయిన్ ని కొన్ని భాగాలుగా విడగొట్టి, ప్రపంచం లో చాల మంది researchers దగ్గరకి పంపించారు, ఈ రీసెర్చ్ ని ఐంస్టీన్ కుటుంబ సభ్యులు వెతిరేకించారు, అయితే researchers ఐంస్టీన్ బ్రెయిన్ కి  నార్మల్ హ్యూమన్ బ్రెయిన్ కి కొంచెం డిఫరెన్స్ ఉంది అని చెప్పారు, మన బ్రెయిన్ లో  mathematical థింకింగ్ చేసే parietal  lobe  నార్మల్ బ్రెయిన్ లో ఉండేదాన్ని కన్నా 20 % పెద్దగా ఉంది అని చెప్పారు. దీనివల్లే ఐంస్టీన్ తెలివైన వాడు అని కొంతమంది అనుకున్నారు, కానీ చిన్న పిల్లలో ఉండే curiosity ఆల్బర్ట్ ఐంస్టీన్ కి  76 సంవత్సరాలకి కూడా ఉంది అందుకే ఆయన అంత తెలివైన వాడు అవ్వగలిగాడు, చివరి నిమిషం వరుకు ఒక మంచి మనిషి గా ఒక క్యూరియస్ సైంటిస్ట్ గా తన జీవితం తో ఇప్పటికి ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా నిలిచాడు.

తన పర్సనల్ లైఫ్ లో ఎన్నో problems ఉన్నాయి,అయినాసరే ప్రపంచంలో ఎంతో మంది కి మంచి మనిషి గా బ్రతికాడు. ఆయన చివరి సంవత్సరాలలో teach చేసిన princeton  యూనివర్సిటీ విద్యార్థులు ఐంస్టీన్ ని ఎంతగానో అభిమానించేవారు, అంతే కాదు ఆయన ఇంటికి వచ్చే చిన్న పిల్లలకి maths homework చేసి పెట్టేవారు, దానికి బదులుగా ఐస్ క్రీం లేదా చాక్లెట్ తీసుకునేవారు. ఆయన ఒక సైంటిస్ట్ గా ఎంతో ఎత్తుకు ఎదిగిన ఒక మనిషి, సగటు మనిషికి ఎప్పుడు సహాయం చేస్తుండేవారు,ఇలాంటి ఒక గొప్ప హ్యూమన్ అంతకన్నా గొప్ప సైంటిస్ట్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే be curious. ఏ విషయం లో అయినా మనకి ఒక క్యూరియస్ అప్రోచ్ ఉంటె దాన్ని మనం మాస్టర్ చేస్తాం.


1 Comment

ధనవంతుడు vs పేదవాడు |7 MAIN DIFFERENCES BETWEEN THE RICH AND THE POOR IN TELUGU

8/31/2018

0 Comments

 

ఒక మనిషి ని ధనవంతుడిని అవ్వనివ్వకుండా  ఆపుతున్న ఏడు కారణాలు ఏంటో చూదాం.

1 . YOU  FOCUS ON SAVING MONEY THAN MAKING MONEY  
చాలా మంది డబ్బు ని వెనకవేయడం లో వాళ్ళ శ్రమ ని అంత వాడతారు, డబ్బు ని సేవ్ చేయొద్దు అని ఎవరు చెప్పారు , కానీ డబ్బు ని సేవ్ చేయటం ఒకటే చేసి , డబ్బు సంపాదన కి వేరే మార్గాలు చూడకపోతే . మీరు ధనవంతుడు అయ్యే అవకాశం చాలా తక్కువ. ఏ ధనవంతుడిని అయినా మనం ఒకసారి ఒబ్సెర్వె చేస్తే  వాళ్ళు ఎప్పుడు రకరకాల వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేస్తూనే ఉంటారు, అండ్ వాటి నుంచి రిటర్న్స్ కూడా రాబట్టుకుంటారు. ధనవంతుడు అవ్వాలి అంటే డబ్బులు దాచటం ఒకటే తెలిస్తే సరిపోదు, ఆ డబ్బు ని తెలివి గా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో కూడా తెలుసుకోవాలి.

2 . You WANT TO GET PAID BASED ON YOUR TIME 

కొంత మంది ఎలా ఆలోచిస్తారు అంటే, నేను ఇంత టైం పని చేశా నాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, సో నాకు ఈ పనిలో ఎక్కువ డబ్బు ఇవ్వాలి అని అనుకుంట ఉంటారు, కానీ కొంత మంది ఒక వేల్యూ create  చేస్తారు అందరికి ఉపయోగ పడే product చేస్తారు, నిజానికి వీళ్ళకి ఎక్స్పీరియన్స్ తో సంబంధం ఉండదు వీళ్ళకి ఆ productకి ఇంత అని వచ్చేస్తుంది, ఉదాహరణకి సూర్య , విజయ్ ఒకేసారి వ్యాపారం మొదలు పెట్టారు సూర్య ఏమో నేను ఇంత టైం పనిచేస్తే నాకు ఇంత రావాలి అనే మైండ్సెట్ లో ఉన్నవాడు, విజయ్ ఏమో ఏదైనా వేల్యూ create  చేస్తే మనకి డబ్బులు వస్తాయి అని తెల్సిన వాడు ,  అప్పుడు ఎలా ఉంటుంది అంటే, ఆ వ్యాపారానికి సంబంధించిన పనులు, క్లైంట్స్ కి, ఎస్టాబ్లిష్ చేయడానికి కొంత టైం పడుతుంది, దానికి 2 ఏళ్ళు పట్టింది అనుకుందాం, ఇంత చేసిన  వ్యాపారం లో సక్సెస్ అవుతారు అని గారంటీ లేదు, అప్పుడు, సూర్య ఎం చేస్తాడు అంటే నేను ఇన్ని ఏళ్ళు కష్టపడినా నాకు డబ్బు రాలేదు అని ఆ వ్యాపారాన్ని వదిలేస్తాడు, విజయ్ మాత్రం డబ్బు ని expect  చేయకుండా , నేను ఇంకా కరెక్ట్ గా పని చేయలేదు  అని ఎక్కువ గా కష్టపడి తన ప్రోడక్ట్ ని అందరికి ఉపయోగకరంగా మార్చి డబ్బులు సంపాదిస్తాడు. అందుకే మీ వ్యాపారం లో ఇంత సమయానికి ఇంత రావాలి అనే లెక్క వేయకండి, మీ ప్రోడక్ట్ ని నమ్మండి, దాన్ని జనాలకి ఉపయోగకరంగా ఎలా చేయాలి అని ఆలోచించండి, డబ్బే మిమల్ని వెతుకుంటుం వస్తుంది.

3 . You SURROUND YOURSELF WITH WRONG People 
ఎప్పుడైనా సరే నీ గోల్ ని నువ్వు achieve చేయాలి, అలాగే వాళ్ళ వాళ్ళ గోల్స్ లో సీరియస్ గా ఉండేవాళ్ల తో మనం ఎక్కువ గా మన సమయాన్ని గడపాలి, ఎందుకంటే ఇలాంటివాళ్ల వల్ల మనకి  మన గోల్ మీద ఎక్కువ శ్రద్ధ పెరుగుతుంది, ఎప్పుడైతే మనం ఇలాంటి వాళ్ళ తో కాకుండా లైఫ్ లో ఎక్కువ seriousness లేని వాళ్ళ తో సమయం గడుపుతామో స్లో గా నువ్వు కూడా నీ గోల్ నుంచి ఇంకా  దూరం అయిపోతావ్. ఎప్పుడైనా ambitious గా ఉండేవాళ్ల తో స్నేహం చేస్తే ఎప్పుడు ఏదోకటి నేర్చుకుంటూ ఉంటాం. అలాంటి వాళ్ళ తో ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేయడం, కొత్త వ్యాపారాల గురించి తెలుసుకుంటాం చేయాలి.

4 . You HAVEN'T STARTED INVESTING YET 

ఇది అందరికి జరిగే విషయమే, ఉద్యోగం వచ్చాక అనుకుంటాం, ఏదొక దాంట్లో ఇన్వెస్ట్ చేదాం అని, కానీ అప్పుడు ఏదో ఒక అవసరాలు పడి ఇన్వెస్ట్మెంట్ కోసం దాచిన డబ్బులను వేరే వాటి కోసం వాడేస్తాం, అలా అలా లేట్ 40 's  లో కి వచ్చేసరికి అరె ఎందులో అయిన ఇన్వెస్ట్ చేయాలి అని మల్లి అనుకుంటాం, దీనికి ఒక కారణం ఏంటి అంటే ఇప్పుడు ఎందులో అయినా ఇన్వెస్ట్ చేస్తే దాని రిటర్న్స్ ఎప్పుడు వస్తాయో తెలీదు, అందుకే చాలా మంది ఇన్వెస్ట్ చేయరు, కానీ ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఇరవై ఏళ్ళు అప్పుడు ఎందులో అయినా ఇన్వెస్ట్ చేస్తే  కనీసం మీరు నలభై ఏళ్ళకి అయినా దాని మీద రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది అందుకే ఎప్పుడయినా మీరు యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడే ఇన్వెస్ట్మెంట్ లు చేయండి, 

5 .You are BUYING WHAT YOU CAN'T AFFORD 
ఇందాక చెప్పుకున్న పాయింట్ లో మనం ఇన్వెస్ట్ చేయకుండా కొన్ని వస్తువులను కొనుకుంటాం అని అన్నాను , అదే మనం చేస్తున్న తప్పు , మనకు అక్కర్లేని వస్తువులను కొన్ని ప్రేస్టిజ్లకు పోయి కొంటాం, దాని వల్ల ఆ సమయానికి ఆనందం ఉన్న పోను పోను మీకే అనిపిస్తుంది దీన్ని కొంటాం కన్నా ఎందులో అయినా ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అని . అది ఎలాగా అంటే చాల మంది ఈమధ్య కాలం లో emi లో ఫోన్ లు కార్ లు కొంటారు, దాన్ని మనం మార్కెట్ price  మీద ఇంటరెస్ట్ వేసి మరి కడతాం, దీని వల్ల మనకి లాభం లేకపోగా కొన్ని emi కంపెనీలు లాభపడుతున్నాయి. వాళ్ళు ఇచ్చే యాడ్ లో కూడా మీరు గమనిస్తే , emi  లో ఏమైనా కోనేసేవాచు అని ఫీలింగ్ ఇచ్చే లా యాడ్ లు వేస్తారు, రోజు emails  పంపుతారు. ఇలా స్లో గా మనల్ని వీక్ చేసి మనతో మనకి అక్కర్లేని వస్తువులను మనకి ఎంతో ముఖ్యంగా అనిపించేలా చేసి, మన తో ఆ వస్తువు కొనిపించి వాళ్ళు వడ్డీ వసూల్ చేస్తారు, ఏదైనా కొనే ముందు ఒకసారి అనుకోండి నిజంగా మీకు అవసరం ఉందా? ఆ వస్తువు కొన్నాక దాన్ని నెల నెల భరించగలమా? ఆలోచించండి ఎప్పుడు మనకి అవసరం లేనివి కొనడం కంటే ఫ్యూచర్ లో మనకి రిటర్న్స్ వచ్చే వాటిలో ఇన్వెస్ట్ చేయండి, మీరు ఎవరికో వడ్డీ కడతం కాదు, మీ డబ్బులు మీకు తిరిగి రిటర్న్స్ ఇచేలా ప్లాన్ చేయండి.

6 . You STOP LEARNING AFTER COLLEGE 

మన కాలేజీ అయిపోయాక, హమ్మయ్య చదువు పని అయిపోయింది, మనం చదివిన చదువు ఉపయోగించి , మనం సంపాదించడం మొదలుపెట్టాలి అని అనుకుంటాం,  ఇది ఒక అంత వరుకు నిజమే, కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎదగాలి అంటే ఎప్పుడు నిరంతరం మన పని లో మనం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి, ఎప్పుడు అయితే మనం నేర్చుకుంటాకి ఏమి లేదు అని నేర్చుకుంటాం ఆపేస్తామో, మనం ఎదగటం కష్టం అయిపోతుంది. బాధాకరమైన విషయం ఏంటంటే చాలా కాలేజీ లో స్కూల్ లో, జీవితం లో ఉపయోగపడే స్కిల్స్ నేర్పించారు, జనాలతో ఎలా మాట్లాడాలి, మంచి కనెక్షన్స్ ఎలా మైంటైన్ చేయాలి,టీం ని ఎలా బిల్డ్ చేయాలి, ప్రాజెక్ట్స్ ఎలా ప్లాన్ చేయాలి, డీల్స్ ఎలా మాట్లాడాలి ఇలాంటివి మన బిజినెస్ లో మన జీవితం లో ఎంతగానో ఉపయోగపడేవి. వీటిని మనం ప్రాక్టికల్ గా నే నేర్చుకోవాలి. ఇలాంటివాటి వల్ల మనకి మన డబ్బు ని ఎలా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది, కనెక్షన్స్ మైంటైన్ చేయటం వల్ల వాళ్ళు చేస్తున్న తప్పులు ఏంటి వాళ్ళు చేస్తున్న మంచి ఇన్వెస్ట్మెంట్లు ఏంటి తెల్సుకోవచ్చు. ఇవి అన్ని నీ ఇన్వెస్ట్మెంట్ ని మెరుగు పరిచి, మిమల్ని ధనవంతుడిని చేయడానికి ఉపయోగ పడుతుంది.

7 You are TRYING TO GET RICH FAST 

మళ్ళి కొంత మందిని బాధ పెట్టె నిజం ఏంటంటే ఫాస్ట్ గా ఎవరు రిచ్ అవ్వలేరు, లాటరి లో తప్ప, youtube లో చాల వీడియోలు  ఉంటాయి వారం లో ఇంత సంపాదించొచ్చు, నెల లో ఇంత  సంపాదించొచ్చు అని, ఇవన్నీ ట్రై చేసిన వాళ్ళని ఒకసారి అడగండి, వాటివల్ల ఎవడు ధనవంతుడు అవ్వలేదు అనే విషయం చెప్తారు,. చాలా ఫార్వర్డ్ మెసేజ్ లు వస్తాయి కొన్ని campaigns  వస్తాయి,  వెంటనే ఇంత డబ్బు వస్తుంది అని చెప్తారు  , వాటిని ఇంక జీవితం లో చూడకండి, అలాంటి మెసేజ్ లు వస్తే డిలీట్ బటన్ నొక్కేయండి, ఈ ప్రపంచం లో ధనవంతుడు అవ్వాలి అంటే ఒకటే దారి, అది చాలా బోరింగ్ గా ఉంటుంది, అయిదు పది లేదా పదిహేను ఏళ్ళ లో ఇంత సంపాదించాలి దానికి దారి ఇది అని నిర్ణయించుకోండి, ఆ ప్లాన్ కి స్టిక్ అవ్వండి, మధ్య లో వచ్చే చెత్త యాడ్స్ కి మీ డ్రీం వదులుకోకండి. మీరు తప్పకుండ ధనవంతులు అవుతారు.

మేము ఇప్పుడు మీకు ఒక మనిషిని ధనవంతుడు అవ్వనివ్వకుండా ఆపుతున్న 7 కారణాలు గురించి చెప్పాను, ఇంతకు మించి కూడా ఉండొచ్చు, మీరు ఏమంటారు, మిమల్ని ఆపుతున్న కారణం ఏంటి? మా వీడియో మీకు ఎలా అనిపించింది? కామెంట్స్ లో చెప్పండి. మా ఛానల్ కి subscribe  చేసుకుంటం మరిచిపోతే ఇప్పుడే ఆ సబ్స్క్రయిబ్ బటన్ ని క్లిక్ చేసి బెల్ ఐకాన్ ని కూడా ఆక్టివేట్ చేసుకోండి , ​
0 Comments

మీ విజయానికి 5 మెట్లు | 5 Steps To Change Your Life

8/30/2018

0 Comments

 

How  to live a happy  life ?

ఈ question కి ఆన్సర్ తెలిస్తే ఎవరైనా జీవితం లో హ్యాపీగా  బ్రతికేస్తారు కదా?

ఇప్పుడు ఉన్న మన సొసయిటీ లో మనకి లెక్కలేనన్ని ఛాయస్ లు ఉన్నాయి, నీ కెరీర్ నే ఉదాహరణగా తీసుకుంటే ఇంజనీర్, డాక్టర్, రైటర్, లాయర్, ఫిలిం మేకర్ ఇలా ఎన్నో ఎన్నో ఎన్నో , ఇన్ని attractive కెరీర్స్ ఉన్నప్పుడు మనం ఎం తెలుసుకోవాలి అంటే మీ పర్పస్ అండ్ మీ వాల్యూస్ ని పూర్తి చేసే ఛాయస్ ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఒక్క ఛాయస్ తీసుకున్నాక మీ దృష్టి లో ఇంకో ఛాయస్ గురించి ఆలోచించనేకూడదు, మీ ఛాయస్ నీ దృష్టిలో పెట్టుకుని దానికి ఎం కావాలో అవి చేస్తూ ఉంటె మీ లైఫ్ సింపుల్ గా ఉంటుంది, మీ జీవితం లో ఎక్కువ choices ఉంటె మీ లైఫ్ complicated అవుతుంది. అందుకే ఎప్పుడు తక్కువ choiceలు పెట్టుకోండి అది లేదు ఇది లేదు అనే ఆలోచన లో ఉండకండి . చాల researches లో కూడా చెబుతుంది ఏంటి అంటే నిజమైన ఆనందం తక్కువ choice లో నే ఉంది అని. అలాగే మీ జీవితం లో మీరు ఛాయస్ లు  ఎలా తీసుకుంటున్నారో, వేరే వాళ్ళ జీవితం లో వాళ్ళకి వారు తీసుకునే ఛాయస్ ని కూడా మీరు గౌరవించాలి, మీరు ఒక్క రిలేషన్ లో ఉన్నప్పుడు మీ ఛాయస్ కరెక్ట్ అని మీరు ఎలా అనుకుంటారో అవతల వారు కూడా వారి ఛాయస్ కరెక్ట్ అని అనుకుంటారు సో వాళ్ళ choice కి  respect ఇచ్చి మాట్లాడాలి.  అండ్ చాలా మంది వాళ్ళ పిల్లల కోసం వాళ్ళ మనవళ్లు మనవరాళ్లు  కోసం పనిచేస్తునాం అని వారు పోయాక కూడా వారు సంపాదించింది వారి తరువాత వారికి ఉపయోగపడాలి అని కష్టపడిపోతా ఉంటారు, కానీ మీరు నిజంగా హ్యాపీ బ్రతకాలి అంటే ఇంత ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా మీ ప్రస్తుతం లో బ్రతకాలి ఎందుకంటే, డబ్బు సంపాదించాలి అని వాళ్ళ కుటుంబానికి సమయం ఇవ్వకుండా తిరగటం వల్ల వారు కొలిపోయేది డబ్బు తో వెల కట్టలేనిది, చావు అందరికి వస్తుంది, మీరు చనిపోయాక మీ ఫామిలీ ఆనందం గ బ్రతకాలి అనే ఆలోచన కన్నా చచ్చే లోపు మీ ఫామిలీ తో మీరు  ఆనందం గ బ్రతకాలి అనేది అసలైన సీక్రెట్.

0 Comments

ఈ technique ద్వారా అనుకున్నది సాధించండి |THE HIDDEN POWER OF SUBCONSCIOUS MIND AND VISUALIZATION

8/27/2018

0 Comments

 
0 Comments
<<Previous

    Categories

    All
    Book Summary
    Entrepreneurship
    Goal Setting
    SELF HELP TELUGU
    Study Tips

    RSS Feed

We Would Love to Have You Visit Soon!


Hours

M-F: 7am - 9pm

Telephone

8328461216

Email

telugugeeksofficial@gmail.com
  • home
  • involve
  • library
  • blog
  • Contact